బాబు గోగినేనిపై కేసు…!?
ప్రముఖ హేతువాది బాబు గోగినేని తెలియని వారుండరు. ప్రస్తుతం బిగ్ బాస్2 లో ఇంటి సభ్యుడుగా ఉన్న బాబుగోగినేనిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు బిగ్ బాస్ షో కు ఎలాంటి సంబంధం లేదు. మియపూర్ కోర్ట్ ఆదేశాల మేరకు బాబు గోగినేని పై 4 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. గతంలో హ్యూమనిస్ట్, హేతువాద సిద్ధాంతాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు బాబు గోగినేని.
బాబుగోగినేని నిర్వహించిన కార్యక్రమాలకు వచ్చేవారి నుంచి ఆధార్ సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని వీరనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతర దేశాల పై విద్వేష కర వ్యాఖ్యలు చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.యూట్యూబ్, ఫేసుబుక్ లో సమాచారం సేకరిస్తున్నామని, కోర్టు ఆదేశాల మేరకు బాబు గోగినేని పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని మాదాపూర్ పోలీసులు తెలిపారు.