పంచాయ‌తీ ఎన్నికలపై హైకోర్టు స్టే…!!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బిసి గణాంకాలు తేల్చకుండా ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసిన‌ నేప‌థ్యంలో హైకోర్టు విచారించింది. తెలంగాణ బిసి కమిషన్ సర్వే రిపోర్ట్ చేయకుండా ఫైనాన్స్ కమిషన్ బిసి రిపోర్ట్ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది.

తెలంగాణ గ్రామ పంచాయితీ రాజ్ యాక్ట్ లో బిసి జనాభా 34 % ఉందని, శాసన సభ బిల్లు లో 37% పెట్టారు. సకల జనుల సర్వే లో 54 % పెట్టారు.ఈ మూడింటిలో ఏది నిజమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. బిసి కమిషన్ తో 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రకారము బిసి ల సమగ్ర జాబిత చేయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి జాబితా లను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేసింది.