‘విజేత’ ట్రైలర్.. సూపర్ హిట్ !

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. జులై మొదటి వారంలో ‘విజేత’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకొనేలా విజేత ఉన్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ఓకే చేసిన కథతో ‘విజేత’ తెరకెక్కింది. కొత్త దర్శకుడు రాకేష్ శశి కథ-కథనంతో ఆకట్టుకోనున్నట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. సరదా సరదా సన్నివేశాలు. ఆకట్టుకొనే లవ్ ఏపీసోడ్. ఫాదర్ సింటిమెంట్ టచ్ తో ట్రైలర్ ని రక్తికట్టించారు. తొలి సినిమాతోనే కళ్యాణ్ ని ఆర్ రౌండర్ గా చూపించే ప్రయత్నం చేసినట్టు కనబడింది. ధనుష్ ‘రఘువరణ్ బీటెక్’ సినిమా ఛాయలు విజేత ట్రైలర్ లో కనిపించాయి. ఇప్పటికైతే ట్రైలర్ సూపర్ హిట్. సినిమా కూడా ఈ రేంజ్ లోనే ఉంటే.. కళ్యాణ్ హిట్ తో ఎంట్రీ ఇచ్చినట్టే.. !