వివాదంలో బ్రాహ్మ‌ణుల అమ్మాయి.. న‌వాబుల అబ్బాయి..!!

“భ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి” పేరుతో వస్తున్న ఓ మూవీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా , హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మార్చే విధంగా ఉన్న ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలని ప‌లువురు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంగ‌ళ‌వారం లాలాగుడాలో విశాల్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా , బుధ‌వారం మల్కాజిగిరి పోలీసులకు రిత్విక్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశాడు. ఇలాంటి సినిమాలు యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయ‌ని, మతమార్పిడి, లవ్ జిహాదీని ప్రొత్సహించేలా ఉన్నాయ‌ని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.