మహేష్ ఐటమ్ అదిరిపోయేలా.. !

సూపర్ స్టార్ మహేష్ కోసం అదిరిపోయే ఐటమ్ ట్యూన్ రెడీ అయ్యింది. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే డెహ్రాడూన్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. అక్కడ మహేష్ స్టూడెంట్ గా కనిపించే సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ ఏపీసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మరోవైపు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మహేష్ కోసం ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఐటమ్ సాంగ్ ట్యూన్ రెడీ అయింది. అదిరిపోయేలా ఉందని చెబుతున్నారు.

దేవి శ్రీ అదిరిపోయే ఐటమ్ సాంగ్స్ ని ఇస్తుంటాడు. మహేష్ 25 కోసం అలాంటి ఐటమ్ నే రెడీ చేశాడని తెలిసింది. ఈ సాంగ్ ని స్టార్ హీరోయిన్ పై షూట్ చేయనున్నాడు. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది. దర్శకుడు వంశీ మహేష్ 25వ సినిమాని బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ స్టయిల్ లో తెరకెక్కించనున్నట్టు సమాచారమ్. హిరాని బాలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఆయన మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే.. లాంటి సినిమాలొచ్చాయ్. ప్రస్తుతం ఈ దర్శకుడు సంజయ్ దత్ బయోపిక్ ని ‘సంజు’గా తీసుకొస్తున్నారు.

ఇక, మహేష్ 25 సినిమా కోసం ‘రాజసం’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్, నరేష్ రూమ్ మేట్స్ గా కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ గెడ్డెం లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి లేదంటే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.