బెజవాడ దుర్గమ్మకు కేసీఆర్ సమర్పించే మొక్కు ఇదే..!
బుధవారం సీఎం కేసీఆర్ విజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గామాతను దర్శించుకుంటారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఉదయం 12గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి 12 గంటల 5నిముషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 2గంటల 5నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
గతంలో తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు సాలిగ్రామ హారం, పేటల కంటె, తిరుచానూరు అమ్మవారికి బంగారు ముక్కుపుడక, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు పూతగల కిరీటం, కురివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడకను సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు.