రవితేజతో.. రెండోసారి !

మాస్ మహారాజా రవితేజ ‘నేల టికెట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మాళవిక శర్మ. ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐతే, మాళవిక గ్లామర్ తో ఆకట్టుకొంది. దీంతో తెలుగులో ఈ యంగ్ హీరోయిన్ కు మరిన్ని అవకాశాలు రావొచ్చనే ప్రచారం జరిగింది. ఆమె రెండో ఛాన్స్ కూడా రవితేజనే ఇచ్చాడు. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా మాళవికని తీసుకొన్నారు. ‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’ మాదిరిగా రవితేజ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో రవితేజ త్రిపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తర్వాత వి. ఐ ఆనంద్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు మాస్ మహారాజా.
‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజ టచ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. ఐతే, ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’ సినిమాలతో మళ్లీ పాత దారిలోకే వెళ్లాడు. దీంతో శ్రీనువైట్ల, వి. ఐ ఆనంద్ సినిమాలపై రవితేజ ఆశలు పెట్టుకొన్నారు.