రేణు.. దుకాణం క్లోజ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ఈ సందర్భంగా రేణుకు పవన్ విషెస్ తెలిపారు. “కుమారి రేణు గారు… సంతోషం కోసం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతీమాతను కోరుకుంటున్నాను” అంటూ ట్విట్ చేశారు పవన్.
పవన్ – రేణు విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. ఇన్నాళ్లుగా రేణు పిల్లలతో కలిసి పూణేలో ఉంటుంది. ఈ మధ్యే ఇన్నాళ్లకు తనకో తోడు దొరికింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది రేణు. ఐతే, రేణు నిర్ణయాన్ని పవన్ అభిమానులు వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా రెండో పెళ్లి వద్దంటూ వదినమ్మని రిక్వెస్ట్ చేశారు కూడా. అవి కాస్త రేణుకు చిరాకు తెప్పించాయ్. ఇన్నాళ్లుగా ప్రేమగా వదినమ్మ అని పిలుచుకొన్న పవన్ అభిమానులపై ఫైర్ అయ్యింది.
పవన్ తో విడాకులు తీసుకొన్నా.. అభిమానులతో రేణుకు మంచి ఎటాచ్ మెంట్ ఉండేది. పవన్ కు సంబంధించిన ఎవ్వరికీ తెలియని విషయాలని రేణు అభిమానులతో పంచుకొనేది. పవన్ అరుదైన ఫోటోలని ఫ్యాన్స్ కోసం ట్విట్టర్ లో పోస్ట్ చేసేది. ఇవన్నీ పవన్ అభిమానులని సంతోషపెట్టాయి. ఇప్పుడు రేణు రెండో పెళ్లి చేసుకోబోతున్న వేళ.. పవన్ అభిమానులతో కటీఫ్ చెప్పేసింది. రేణు తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేసింది. దీంతో పవన్ అభిమానులు బాధలో ఉన్నట్టు కనబడుతోంది. తన రెండో పెళ్లికి సంబంధించిన అప్ డేట్స్ పవన్ అభిమానులతో పంచుకోలేకనే.. రేణు తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది.