పోలీసులను ఆశ్రయించిన శేఖర్ కమ్ముల.. !
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ అజ్ఞాత వ్యక్తి తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు చెప్పుకొని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని క్వికర్ , olx లో యాడ్స్ ఇస్తున్నాడు. సినిమా లో ఛాన్స్ కోసం ఆడిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ అకౌంట్ నెంబర్ పెట్టాడు. దీంతో తన పేరును వాడుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై శేఖర్ కమ్ముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్లు లేరని ,అనుమానం వచ్చి పోలీసులకుచెప్పారు శేఖర్ కమ్ముల. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.