కుప్పకూలిన ఛార్టర్డ్‌ విమానం.. ఐదుగురు మృతి


ముంబైలోని ఘట్కోపర్‌లో ఓ ఛార్టెడ్‌ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీర్లు, ఓ పాదచారి ఉన్నట్టు తెలిసింది. మృతదేహాలను ఘట్కోపర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఈ విమానం ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. మరికొద్దిసేపట్లో జుహు ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఆ విమానం ఓ నిర్మాణంలో ఉన్న భవన సముదాయం వద్ద కూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ప్రమాదం ధాటికి విమానం దాదాపు పూర్తిగా దగ్ధమైంది.