ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు ఎంతో తెలుసా..!!

దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ ప్ర‌మాణ స్వీకారం చేస‌న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు స‌మావేశాల్లో పాల్గొన్నారు. భార‌త్ ఖ్యాతిని పెంచేందుకు, వివిధ దేశాల‌తో సంధి కుదుర్చుకునేందుకు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిసార్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు, ఎన్ని దేశాల్లో ప‌ర్య‌టించారు, ఎన్నిరోజులు విదేశాల్లో గ‌డిపారు, వాటికి అయిన ఖ‌ర్చు ఎంత అనేదానిపై ఆర్టీఐ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు విదేశీ పర్యటనల కోసం 355 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖర్చుపెట్టినట్టు ఆర్టీఐ వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన 48 నెలల కాలంలో ఆయన 41 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని, మొత్తం 50కి పైగా దేశాల్లో పర్యటించారని పేర్కొంది. ప్రధాని విదేశీ పర్యటనలపై బెంగళూరుకు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త కోరిన వివరాల మేరకు ఆర్టీఐ వీటిని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 165 రోజులు ప్రధాని విదేశాల్లోనే ఉన్నారని తెలిపింది.