గ‌ద్వాలలో కేసీఆర్ బ‌హిరంగ స‌భ..!

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ఈ నెల 29న‌ సిఎం కెసిఆర్‌ ప‌ర్య‌టించ‌నున్నారు. గ‌ద్వాల‌లో భారీ బ‌హిరంగ‌స‌భలో కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఐజ రోడ్డులోని బ‌హిరంగ సభా స్థ‌లాన్ని, ఏర్పాట్ల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి ప‌రిశీలించారు. తుమ్మిళ్ళ ప్రాజెక్టు, గ‌ట్టు మండ‌లం పెంచిక‌ల పాడు ద‌గ్గ‌ర పైలాన్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు మంత్రి.

తెలంగాణ ప్ర‌భుత్వంలో అన్ని అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా వేగంగా అమ‌లు అవుతున్నాయని, ప్రాజెక్టులు కూడా నిర్థీత స‌మ‌యానికంటే ముందుగానే పూర్త‌వుతున్నాయని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశ‌గా ప‌నులు జ‌రుగుతున్నాయని, అన్ని ప్రాజెక్టులు పూర్తయి, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా స‌స్య‌శ్యామ‌లం అవ‌డం కాయమ‌న్నారు. ఆకుప‌చ్చ పాల‌మూరుని త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నామ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ల‌స‌లు ఇప్ప‌టికే వాప‌స్ అవుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు తిరిగి త‌మ ఊళ్ళుకు వ‌స్తున్నారన్నార‌న్నారాయ‌న‌.