రోహిత్ @1000 నాటౌట్‌

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సొగసైన బ్యాటింగ్ చేసే ఆటగాడిగా రోహిట్ శర్మకు పేరుంది. రోహిత్ శర్మ బ్యాట్ ఝలిపిస్తే వార్ వన్ సైడ్ అయినట్టే. ఇప్పుడీ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో రోహిత్‌ శర్మ 97 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

మూడు ఫార్మాట్లలో టెస్టు, వన్డే, టీ20.. కలిపి రోహిత్‌ శర్మ 10,022 పరుగులు సాధించాడు. భారత ఆటగాళ్లలో సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరభ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, అజారుద్దీన్‌, సునీల్‌ గావస్కర్‌, యువరాజ్‌ సింగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, గౌతమ్‌ గంభీర్‌తో పాటు మరికొందరు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరిపోయారు.