బిగ్ బాస్ హౌస్’లోకి తారక్.. ఎప్పుడో తెలుసా ?

తెలుగు బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లో మెరవనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ – 1 సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఐతే, ఆ రేంజ్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ – 2 లేకపోవడం బిగ్ బాస్ అభిమానులని నిరాశకు గురిచేస్తోంది. రేటింగ్ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ఆలోచనలో పడ్డ బిగ్ బాస్ యాజమాన్యం మళ్లీ ఎన్టీఆర్ తీసుకురానున్నారనే ప్రచారం జరిగింది. అందుకు తారక్ అస్సలు ఒప్పుకోడని బిగ్ బాస్ నిర్వాహకులకు తెలుసు. అందుకే తారక్ తో స్పెషల్ ఎంట్రీ ఇప్పించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

బిగ్ బాస్ సీజన్ – 2ని 16మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు ప్లాన్ చేశారు. సీజన్ 2 ప్రారంభానికి ముందు ఈసారి ఇంకొంచెం మసాల అంటూ ఊరించాడు నాని. ఆ తర్వాతే తెలిసిందే… ఉన్న మసాలే మిస్సయిందని. ఇప్పటికే షో రెండు వారాలు పూర్తి చేసుకొంది. సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ఇద్దరిపై బిగ్ బాస్ వేటు వేయడంపై విమర్శలొస్తున్నాయి. షో రేటింగ్ పడిపోనుందని ముందే ఊహించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్ టీఆర్ ని స్పెషల్ గెస్ట్ గా తీసుకురాబోతున్నారు.

ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం చూసుకొని బిగ్ బాస్ సీజన్ 2 కోసం డేట్స్ ఇవ్వనున్నారు. ఐతే, హౌస్’లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇస్తారా.. ? లేదంటే నాని తో కలిసి హోస్ట్ గా మరోసారి అదరగొడతారా… ?? ఇదీగాక, నానిని ప్రక్కన పెట్టే తారక్ నే షోని డీల్ చేస్తాడా.. ??? అనేది ఆసక్తిగా మారింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్ చేసిన తారక్.. సీజన్ 2 కి క్రేజ్ ని తీసుకొచ్చే బాధ్యతని తానే తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది.