‘వైఎస్ఆర్ బయోపిక్’లో ప్రభాస్ పాత్ర బయటడింది.. !

టాలీవుడ్ లోనూ బయోపిక్’ల ట్రెండు మొదలైంది. ఇందుకు ‘మహానటి’ సావిత్రి బయోపిక్ పునాది వేసింది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో తెలుగులోనూ వరుసగా బయోపిక్ లు రూపుదిద్దుకొంటున్నాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ లు పోటాపోటీగా తెరకెక్కుతోన్నాయి. ఈ రెండు బయోపిక్ లు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల ప్రచార అస్త్రాలుగా ప్రచారం జరుగుతోంది. ఐతే, ‘వైఎస్ఆర్’ బయోపిక్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్టుగా నిలుస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

‘ఆనందో బ్రహ్మ’ ఫేం దర్శకుడు మహీ రాఘవ్ దర్శకత్వంలో ‘వైఎస్ఆర్’ బయోపిక్ తెరకెక్కుతోంది. వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. సినిమాను అత్యంత సహజంగా వాస్తవాలకు దగ్గరగా తీస్తున్నారు. ఈ బయోపిక్ వెనక ప్రభాస్ హస్తం ఉన్నట్టు చెబుతున్నారు. సినిమా బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించవద్దు. ఈ సినిమా కోసం తాను అన్ని విధాల సహకరిస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో జగన్ చెల్లెలు శర్మిలా తో ప్రభాస్ కు లింకు పెడుతూ వార్తలొచ్చాయి. ఇప్పుడా అనుబంధంతోనే ప్రభాస్ వైసీపీని సపోర్టు చేస్తున్నారా.. ? లేదంటే జగన్ సీఎం అయితే చూడాలని ఆశపడుతున్న వాళ్లలో ప్రభాస్ కూడా ఉన్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. వచ్చే సాధారణ ఎన్నికల్లోప్రభాస్ జగన్ కు సపోర్టుగా నిలవనున్నట్టు తెలుస్తోంది.