25 కోసం.. మహేష్ సిక్స్ ప్యాక్ బాడీ !

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దీని కోసం మహేష్ ఒకట్రెండు సార్లు ముంబై వెళ్లి స్టయిలీష్ ని కలిసొచ్చాడు. తన కొత్త లుక్ పై సలహాలు తీసుకొన్నారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తెలిపింది. అదే సమయంలో మహేష్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. అందుకే ముంబై వెళ్తున్నాడు అనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే గెడ్డెం లుక్ లో ఉన్న మహేష్ లుక్ బయటికొచ్చింది. ఆ లుక్ తోనే మహేష్ తన 25వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇటీవలే మహేష్ 25వ సినిమా తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో ప్రారంభమైంది. అక్కడ మహేష్ పై కాలేజీలో వచ్చే సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లోనే కాదు.. సిక్స్ బ్యాడీతో కనిపించబోతున్నాడట. హైదరాబాదీ ప్రొఫెష‌న‌ల్ ట్రైన‌ర్ హ‌కీమ్ అలిమ్ సార‌థ్యంలో మహేష్ 6ప్యాక్ యాబ్స్ కోసం సీరియ‌స్‌గా ట్రై చేస్తున్నట్టు సమాచారమ్.ఇటీవ‌లే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో మహేష్ 6సిక్స్ ప్యాక్ న్యూస్ కి మరింత బలం చేకూరినట్టయ్యింది.

గతంలో ‘వన్-నేనొక్కిడినే’ సినిమా కోసం మహేష్ సిక్స్ ప్యాక్ బాడీ డెవలెప్ చేశాడు. ఐతే, మహేష్ సిక్స్ ప్యాక్ బాడీని సుకుమార్ పూర్థిస్థాయిలో ఎలివేట్ చేసి చూపలేదు. కేవ‌లం చొక్కా విప్పి వెన‌క భాగం మాత్ర‌మే చూపించారు. ఐతే, ఈసారి కాలేజ్ స్టూడెంట్ త‌ర‌హాలో 6ప్యాక్‌ని ఆవిష్క‌రిస్తార‌ని తెలిసింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్.. స్టార్లు 6ప్యాక్ యాబ్స్‌తో ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు మహేష్ వీరిని మించేలా 6ప్యాక్ చేస్తాడేమో చూడాలి.