మేకప్ ఆర్టిస్ట్’తో ప్రభాస్ రొమాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాన్స్ బయటపడింది. పెళ్లి మాటెత్తని ప్రభాస్.. ఓ అమ్మాయిని ముద్దులతో ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డార్లింగ్ అంటే పడి చచ్చే అమ్మాయిలు.. ఈ రొమాంక్ పిక్స్ ని చూసి కుళ్లుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ స్వీటీ అనుష్క ప్రేమలో పడ్డాడు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ‘సాహో’ దుబాయ్ షెడ్యూల్ లో గాయపడిన ప్రభాస్ ని చూసేందుకు స్వీటీ అక్కడి వెళ్లింది. ప్రభాస్ కు పెద్ద క్లాస్ తీసుకొంది. దీంతో ప్రభాస్ అంటే స్వీటీకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసింది.

ఐతే, ఇక్కడ ప్రభాస్ రొమాన్స్ చేస్తూ బయపడిన పిక్ అనుష్కది కాదు. ‘సాహో’ మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మానిక్ ది. ఆమెని ముద్దులతో ముంచెస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ ముద్దాడుతుందగా బిల్లీ నవ్వులతో మునిగిపోయింది. మరికొందరు బిల్లీ అంటే ప్రభాస్ కు ఇష్టమేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రభాస్ పెళ్లి మాట ఎత్తితే కస్సుమంటున్న సంగతి తెలిసిందే. పెళ్లి అన్నేది నా పర్సనల్. పెళ్లి కుదిరినప్పుడు.. ఆ విషయాన్ని తానే స్వయంగా చెబుతానని ఇటీవలే సీరియస్ గా చెప్పాడు డార్లింగ్. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ చిన్నపెళ్లాడేం కాదు.. ఆయన్ని పదే పదే పెళ్లి చేసుకోమని అడగటానికని కాస్త ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. చాటు మాటు వ్యవహారాలు ఎలగబెడుతుంటే పెళ్లి చేసుకోవాలనే ధ్యాస్ ఎందుకుంటుందని ప్రభాస్ పై సటైర్లు కూడా పడుతున్నాయి.