బిగ్ బాస్ హౌస్’లో వీళ్ల రొమాన్స్ హైలైట్

తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 మూడోవారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే హౌస్ నుంచి సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో కిరీటి, గణేష్,తేజస్వి, భానుశ్రీ, గీతామాధురి ఉన్నారు. ఐతే, రెండోవారం నుంచి ఇంటి సభ్యులు తేజస్వీ, సామ్రాట్ ల మధ్య ఏదో జరుగుతుందనే టాక్ మొదలైంది. కెమెరాలు ఉన్నాయనే భయం కూడా లేకుండా ఈ జంట హంగులు, కిస్సులతో రెచ్చిపోతుంది. అలకలు, బుజ్జగింపులు కూడా ఎక్కువే.

ఇదంతా చూస్తుంటే హౌస్’లో కెమెరాలు లేని స్థలం కోసం ఈ జంట అన్వేషిస్తున్నట్టు కనబడుతోంది. మైకు వుంది అందరూ వింటారు జాగ్రత్త అంటూ తేజస్వీ సైగ చేయడం చూస్తుంటే పర్సనల్ గా ముచ్చటించేందుకు ఈ జంట ఆసక్తి చూపుతోంది. ఎవరు వింటే ఏమిటి నీకోసం ఏదైనా చేస్తా అంటూ సామ్రాట్ కెమెరాల ముందే చెప్పేశాదు. మొత్తానికి.. తేజస్వీ-సామ్రాట్ ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని చెప్పుకొంటున్నారు. ఆ సమ్ థింగ్ సమ్ థింగ్ బిగ్ బాస్ హౌస్’కే పరితమవుతుందా.. ? బయటికొచ్చాక కూడా కంటిన్యూ అవుతుందా.. ?? అనేది వేచి చూడాలి.