కేటీఆర్ కు విహెచ్ స్ట్రాంగ్ వార్నింగ్… !!

మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత రావు వార్నింగ్ ఇచ్చారు. . తెలంగాణ రాష్ట్రన్ని ఏ అమ్మా ఇవ్వ‌లేదు, బొమ్మ ఇవ్వ‌లేదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా స్పందించారు. సో నియా పై మరోసారి నోరు జారితే నీ ఇంటికే వస్తా.. తాడోపేడో తేల్చుకుంటా ఖబర్దార్ .. అంటూ ఘాటుగా విమ‌ర్శించారు. పోలీసులు ఉన్నారనుకునుకుంటున్నావో ఏమో నీ సంగతి చూస్తా అంటూ హై పిచ్ లో వ్యాఖ్యానించారు .

కేటీఆర్ నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ విమ‌ర్శిస్తూనే నీకొడుకును అదుపులో పెట్టుకో అంటూ కేసీఆర్ కు హిత‌వు ప‌లికారు వీహెచ్. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చ‌రించారు. కాంగ్రెస్ నేత‌లు ల‌ఫంగ‌లు అయితే, కాంగ్రెస్ లో పుట్టిన కేసీఆర్ కూడ ల‌ఫంగానే అని చెప్పుకొచ్చారు. సోనియా తెలంగాణ ఇవ్వ‌క‌పోతే కేసీఆర్ దుకాణం ఎక్క‌డుండేద‌ని ప్ర‌శ్నించారాయ‌న‌.