రాశీకి ఎవరైనా ఓకే.. మేటర్ ఉంటే చాలు.. !

టాలీవుడ్ లో జోరు చూపిస్తున్న యంగ్ హీరోయిన్స్ లో రాశీ ఖన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. వరుసగా యంగ్ హీరోలతో జతకట్టింది. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్సుని, ఫాలోయింగ్ ని సంపాదించుకొంది. అందంతో పాటు, అభినయంలోనూ పరిణతి కనబర్చింది. అదే స్టార్ హీరోల సినిమా ఛాన్స్ తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’, రవితేజ బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాల్లో నటించింది. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’లో తన టాలెంట్ ని పూర్తి స్థాయిలో చూపించింది. తాను యంగ్, స్టార్ హీరోలకి సరిపోతానని రుజువు చేసింది. ఏ హీరోకైనా రాశీ ఖన్నా సరిపోద్ది అనే పేరు తెచ్చుకొంది.

తెలుగులో ఇప్పటికే రాశీఖన్నా దాదాపు 20 సినిమాల్లో నటించింది. వీటిలో ఆమె గ్లామర్ తో ఆకట్టుకొన్న సినిమాలే ఎక్కువ. ఐతే, తనకు ఆడిపాడే పాత్రలు, పూర్తి ప్రతిభ చూపించగలిగే ఆస్కారమున్న చిత్రాలు..రెండూ ఇష్టమే అంటోంది. ఈ రెండు రకాల పాత్రలను సమతూకం చేసుకుంటూ నట ప్రయాణం సాగిస్తాను. స్టార్, యంగ్ హీరోలు ఎవరైనా నాకు ఓకే. పలానా హీరోలతో జతకట్టాలనే పట్టుదల ఏం లేదు అంటోంది. మొత్తానికి.. నాకు ఎవరైనా ఓకే.. మేటరు ఉంటే చాలు అన్నట్టుంది.. రాశీ యవ్వారం.. !!

ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ఇమైక నొడిగల్‌, సైతాన్‌ కా బచ్చా చిత్రాలతో పాటు తెలుగులో శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తోంది.