కురుక్షేత్రలో తిరుమలేశుడు..!!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి దేశ విదేశాల భక్తులు కొలుస్తుంటారు. వివిధ రాష్ట్రల్లో శ్రీవారిని సేవ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయాల విస్తరణ కూడా చేపట్టింది టీటీడి. హర్యానాలోని కురుక్షేత్రలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి
ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు, టీటీడీ జేఈవో భాస్కర్ హాజరయ్యారు. ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం ఆలయంలో వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వామివారిని దర్శించుకున్నారు. నిర్మల్ సేథియా ఫౌండేషన్ సహకారంతో కురుక్షేత్రలో బాలాజీ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ.