‘మహా కూటమి’ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్

సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో పది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ముందస్తుకు వెళ్లితే ఈ యేడాదియే ఎన్నికలు రావొచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ అప్పుడే మొదలైంది. ఏపీలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన యాత్రల పేరిట ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలెట్టాయి. తొలిసారి ఎన్నికల ఎలక్షన్స్ వెళ్తున్న జనసేన తనదైన వ్యూహంతో ముందుకెళ్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకొంది. ఐతే, ఎవరితో కలిసి వెళ్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పరిస్థితులని బట్టి చూస్తుంటే పవన్, కామ్రెడ్స్ తో కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ నే అని తేల్చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రానున్న ఎన్నికల నేపథ్యంలో మహా కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణే. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందని అంటున్నారు.

పవన్ కు ఇమేజ్, క్రేజ్ రెండూ ఉన్నాయి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆయన అన్నట్టుగా వచ్చె ఎన్నికల్లో ఏపీలో మహా కూటమి ఏర్పడుతుందేమో చూడాలి. ఒకవేళ ఏర్పడితే మహాకూటమిలో ఉండే పార్టీలు ఏవేవి ఉంటాయనేది ఇప్పుడే ఊహించలేం.