యుఎస్ సెక్స్ రాకెట్ : క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్
యుఎస్’లో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పేరు హైలైట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యవహారంలో మెహ్రీన్ కి ఎలాంటి సంబంధం లేదు. తాను ఫ్యామిలీతో కలిసి వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్న సమయంలో యుఎస్ అధికారులు తనని విచారించారు. అప్పుడే టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ గురించి తొలిసారి విన్నానని స్వయంగా తెలిపింది మెహ్రీన్.
అప్పటి నుంచి యుఎస్ సెక్స్ రాకెట్ తో మెహ్రీన్ కు లింకు పెడుతూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంతో ఆమెకు లింకు ఉన్నట్టుగానే చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ‘పంతం’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ల వ్యభిచారంపై మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి ‘పంతం’ ప్రీ-రిలీజ్ వేడుకకు మెహ్రీన్ హాజరు కాలేదు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా ‘పంతం’ ప్రీ-రిలీజ్ వేడుకకు రాలేకపోతున్నాని అభిమానులకు ముందే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది మెహ్రీన్. అప్పటికీ ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తుండటంతో మెహ్రీన్ అలర్టయ్యింది. ఈ నేపథ్యంలోయుఎస్ అధికారుల విచారణపై మరింత క్లారిటీ ఇచ్చింది. ఆమె మాటల్లో…
“యూఎస్ఏలో ఏం జరిగిందో మరోసారి నిజం చెబుతున్నాను. నేను నా కుటుంబంతో కలసి వీకెండ్ హాలిడే కోసం వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్నాను. ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో నేను తెలుగు సినిమాల్లో నటినని వారికి తెలిసింది. అప్పుడు వారు నన్ను అమెరికాలో ప్రయాణానికి కారణాలేంటని అడిగారు. సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. ఆ విషయాన్ని తొలిసారిగా విన్నది అప్పుడే. వ్యభిచారంతో నాకు సంబంధం లేదని తెలుసుకుని క్షమాపణలు చెప్పి పంపించారు. ఆపై నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఈ విషయాన్ని నేనే బహిరంగ పరిచాను. మరెవరైనా ఈ విషయంపై అవాస్తవాలు ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఆ సమయంలో నా పరిస్థితికి నేను సిగ్గుపడ్డాను. వణికిపోయాను కూడా” అని క్లారిటీ ఇచ్చింది.
https://t.co/wLm4W3tFqP pic.twitter.com/e32hTv4A9h
— Mehreen Pirzada (@Mehreenpirzada) July 3, 2018