తిరుమ‌ల వివాదంపై హైకోర్టు విచార‌ణ‌..

తిరుమల తిరుపతి వివాదంపై హైకోర్ట్ మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. నగలు మాయమ‌వ‌డం, గుడి లోపల త‌వ్వకాలు , చారిత్ర‌క ఆస్తుల‌ను కాపాడాల ని పిటిషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల వ్యవ‌హారం పై సీబీఐచే ద‌ర్యాప్తు చేయించాల‌ని పిటిష‌న్ లో అనిల్ అనే వ్య‌క్తి పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని టీటీటీని ఆదేశించింది.

గుడి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న పిటిష‌న‌ర్ ఆరోప‌ణ‌ల‌కు టీటీడీ స‌మాధాన‌మిచ్చింది. గుడిలోప‌ల ఎలాంటి తవ్వకాలు జరపలేదని గుడిలో కొన్ని మరమ్మత్తులు మాత్ర‌మే జరిపామని టీటీడీ కోర్టు కు తెలిపింది. తిరుమల లో జరుగుతున్న అక్రమాల పై న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు పిటీషనర్. సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం న్యూస్ పేపర్లో వచ్చిన వాటిని కోర్టు పరిగనించలేమని హైకోర్టు తెలిపింది.
పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.