హైద‌రాబాద్ టూ బీద‌ర్… చిన్నారి కిడ్నాప్ క‌థ సుఖాంతం..

కోఠీ ప్రసూతి ఆసుపత్రిలో పసికందు ఆదృశ్యమైన ఘటన కలకలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ.. ప్రసూతి కోసం గతవారం కోఠి సుల్తాన్‌ బజార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆరు రోజుల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. తల్లి కదల్లేని స్థతిలో ఉండటంతో పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానని తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆ మహిళ బిడ్డను తీసుకురాకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందికి తెలియజేసింది.

అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు హుటాహుటిన గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సిసీ ఫుటేజి ఆధారంగా మహిళ కోసం గాలించారు . ఆ మహిళ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి బీదర్ బస్ ఎక్కినట్లుగా.. బస్ కండక్టర్ తో కన్నడలో మాట్లాడిన ఆధారంగా పోలీసులు బృందాలు పసిబిడ్డ ఆచూకీ కోసం బీదర్ పోలీసులకు స‌మాచార‌మందించారు. దీంతో బీద‌ర్ లో చిన్నారి ఆచూకి తెలిసింది. సుల్తాన్ బ‌జార్ ఏసీపీ చేత‌న పాప‌ను స్వాధీన ప‌రుచుకున్నారు. మ‌హిళా కిడ్నాప‌ర్ ప‌రారీలో ఉంది. గత రెండు రోజులుగా మహిళ కిడ్నపర్ కోసం మూడు బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ మొత్తం కిడ్నాప్ క‌థ‌లో సీసీటీవీ కెమెరాలు కీల‌కంగా మారాయి. మొత్తంమీద కొఠి ఆసుప‌త్రిలో చిన్నారి కిడ్నాప్ క‌థ సుఖాంత‌మ‌యింది..