మళ్లీ.. ప్రభుత్వ గొర్రెలు వచ్చేశాయ్ !
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారభించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. గతేడాది పంపిణీ చేసిన 60లక్షల గొర్రెలతో కొత్తగా 20లక్షల సంతతి పెరిగిందని తెలిపారు. తెలంగాణ యాదవులు దేశంలోనే ధనికులుగా ఎదగాలన్నదే సీఎం ఆకాంక్ష. అందులో నుంచి పుట్టిన ఆలోచనే గొర్రెల పంపిణీ కార్యక్రమని తెలిపారు. అదే సమయంలో ఈ పథకంపై విపక్షాల విమర్శలని మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు.
గొర్రెల పంపిణీపై అధికార, విపక్ష పార్టీల మాటలెలా ఉన్నా.. ప్రభుత్వం పంచిన గొర్రెలు ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక పోతున్నాయనే విమర్శలున్నాయి. ఇదీగాక, కొందరు ప్రభుత్వం పంచిన గొర్రెలని పెంచుకోకుండా.. అమ్మేస్తున్నారు. ఇలా గొర్రెలని అమ్ముకోకుండా.. వాటిని పెంచడమె వృత్తిగా ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం గొర్రెలని ఇవ్వాలనే డిమామ్డ్ వినబడుతోంది.