ఏపీ ఎల్.పి.సెట్ కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ భాషా పండితుల కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్.పి.సెట్) కు మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పండిట్ శిక్ష‌ణా క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల‌కు ఎల్.పి.సెట్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 31 న ఎల్ పి సెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. జూలై 5 నుంచి 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానించారు. ఆన్ లైన్ లో aplpcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. మ్యానువ‌ల్ గా వ‌చ్చే ద‌ర‌ఖాస్తులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. జూలై 26 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ఆగ‌స్టు 1న ఎల్.పి.సెట్ ఫ‌లితాలువిడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 9 నుంచి 11 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు, ఆగ‌స్టు 13, 14 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నట్లు మంత్రి గంటా తెలిపారు.