కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలివే..!!
ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి (సీసీఈఏ) బుధవారం సమావేశమై ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2018-19 కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర క్యాబినెట్. వరి రైతులకు క్వింటాకు 200 రూపాయలు పెంచింది. క్వింటాకు 1,550 రూపాయలు ఉన్న వరి పంట ప్రస్తుత మద్దతు ధర 200 రూపాయలు పెంచగా 1750కి చేరింది.
బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని కట్టుబడి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల ఉత్పత్తి వ్యయంపై కనీసం 1.5 రెట్లు రైతులకు లబ్ది కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యధికంగా రాగికి క్వింటాలకు 900 రూపాయలు పెంచి 2,700 రూపాయలకు సవరించింది ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి. పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1288 కు, పెసర్ల ధర క్వింటాకు 1400 కు, రాగుల ధర క్వింటాకు 997 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంపై 15వేల కోట్ల భారం పడనుంది.