ఎన్టీఆర్ బయోపిక్ : జూ. ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఝ

నటసింహం బాలకృష్ణ నటవారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఝని తెరకు పరిచయం చేయాలనుకొంటున్న సంగతి తెలిసిందే. గత యేడాదియే మోక్షజ్ఝ ఎంట్రీ ఉంటుందని భావించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మోక్షజ్ఝని ప్రత్యేక పాత్రలో పరిచయం చేస్తారని చెప్పుకొన్నారు. కానీ, జరగలేదు. నటుడిగా ఎంట్రీ ఇచ్చే కంటే ముందు ఆయనకు సినిమా సంబంధించిన అన్ని విషయాల్లోనూ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో.. ఆ సినిమాకు అస్టిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయించారు. ఆ తర్వాత కూడా క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఝ ఎంట్రీ ఉంటుందనే వార్తలొచ్చాయ్. ఇప్పుడది నిజమేనని తెలుస్తోంది. ఐతే. సోలో హీరోగా మాత్రం కాదు.

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మోక్షజ్ఝని ఎంట్రీ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో బుడ్డోడు జూ. ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట. ఈ పాత్ర ద్వారా మోక్షజ్ఝని తెరకు పరిచయం చేయాలని అనుకొంటున్నారంట. ముందుగా ఈ పాత్ర కోసం యంగ్ హీరో శర్వానంద్ ని అనుకొన్నారు. ఇప్పుడా పాత్ర కోసం మోక్షజ్ఝ పేరు ని ఖరారు చేసినట్టు సమాచారమ్. ఇందుకోసం మోక్షజ్ఝని సింగపూర్ పంపించి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పించనున్నారు. కాస్త లావుగా ఉన్న మోక్షజ్ఝ అక్కడికెళ్లి సన్నబడే పనిలో ఉండనున్నాడు.

ఇక, ఈ బయోపిక్ లో నందమూరి హరికృష్ణ, ఆయన పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. తండ్రి ఎన్ టీఆర్ పాత్రలో బాలకృష్ణ, ఆయన భార్య బసరవతారం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్, నాదేండ్ల భాస్కర్ రావు పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్. ఎల్వీ ప్రసాద్ పాత్రలో బెంగాలీ నటుడు జిష్ణు, నారా చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి కనిపించబోతున్నారు. ఈ బయోపిక్ రేపే (జూలై 5) సెట్స్ మీదకు వెళ్లనుంది.