‘హిరణ్యకశిప’ బడ్జెట్ ఎంతో తెలుసా ?

గుణశేఖర్ ‘హిరణ్యకశిప’పై ఇటీవలే నిర్మాత సురేష్ బాబు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రానా ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశిప’ ఉంటుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ నిర్మించనుందని తెలిపారు. దాదాపు రెండేళ్లుగా దర్శకుడు గుణశేఖర్ ఈ కథపై కరత్తు చేస్తున్నాడు. స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పుడీ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

దాదాపు రూ. 180కోట్లతో ‘హిరణ్యకశిప’ని తెరకెక్కించనున్నట్టు తెలిసింది. సినిమాకు అవసరమైన రాజప్రాసాదాలు, మంటపాలు, దేవలోకం, వైకుంఠం, ఉద్యానవనాలు వంటి సెట్స్ ను వేయనున్నారు. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ వీటిని ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. కాస్టూమ్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారు. టాలీవుడ్ లో బాహుబలి, సాహో, సైరా.. తర్వాత రానున్న భారీ బడ్జెట్ సినిమాగా హిరణ్యకశిప రానుంది.

ఈ సినిమా భక్తప్రహల్లాద కథతో తెరకెక్కనుంది. ఐతే, కథని హిరణ్యకశిప కోణంలో చెప్పనున్నట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాతో రానా దగ్గుపాటి ఇంటర్నేషన్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమాలకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడా మార్కెట్ ‘హిరణ్యకశిప’ కోసం ఉపయోగపడనుంది.