తారక్ రెండో బుడ్డోడి పేరేంటో తెలిసిపోయిందోచ్.. !

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి దంపతులకు జూన్ 14న రెండో సంతానంగా పండింటి మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని తారక్ స్వయంగా అభిమానులతో పంచుకొన్నారు. ‘మా ఫ్యామ్మిలీ మరింత పెద్దదయ్యింది. మళ్లీ బాబు పుట్టాడు’ అంటూ ట్విట్ చేశాడు. ఆ తర్వాత ఒకట్రెండు రోజులకు పెద్ద కొడుకు అభిరామ్ తమ్ముడిని ఎత్తుకొగా.. దాన్ని ఫోటో తీసున్న తారక్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేశాడు. ఆ ఫోటోని చూసి నందమూరి అభిమానులు మురిసిపోయారు. అంతా తండ్రి తారక్ పోలిక అనే కామెంట్స్ వినిపించాయి.

తారక్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్. మరీ.. రెండో కొడుకు పేరు ఏం పెట్టబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పుడీ ఉత్కంఠకి తెరపడింది. తారక్ రెండో బుడ్డోడి పేరు భార్గవరామ్ గా పెట్టారు. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు తారక్. ఇటీవలే ఖాతా తెరిచిన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో పాటు తన రెండో కుమారుడికి భార్గవరామ్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.


ఇదిలావుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో తారక్ సరసన పూజా హెడ్గే జతకట్టనుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాథాకృష్ణ నిర్మాత.