వరంగల్’లో తారక్ ఫ్యామిలీ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వరంగల్ లో సందడి చేయనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ‘అరవింద సమేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం వరంగల్ వెళ్తున్నట్టు తెలిసింది. అక్కడ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని చిత్రీకరిస్తారట. దీంతో పాటు ఓ యాక్షన్ ఏపీసోడ్ ని ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇటీవలే త్రివిక్రమ్ వరంగల్ లో ఉండి తనకు కావాల్సిన లొకేషన్స్ ఎంపిక చేసుకొని వచ్చాడట.

రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘అరవింద సమేత’ తెరకెక్కనుంది. యాక్షన్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండనున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే వరంగల్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. సినిమా త్రివిక్రమ్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు రషెస్ చూశారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్విట్ చేశారు.ఈ చిత్రంలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.