నాగ్-నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్

నాగ్-నానిలు ప్రేక్షకులని సస్పెన్స్ లో ఉంచేసిన సంగతి తెలిసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సడెన్ గా ఉదయం సాయంత్రం ఓ సస్పెన్స్ రిలీవ్ చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. దీంతో వీరి సినిమా ఫస్ట్ లుక్ పిక్ లేదా టైటిల్ పోస్టర్ వదులుతారని అందరు భావించారు. అదే నిజమైంది. టైటిల్ పోస్టర్ ని వదిలారు.

ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ మల్టీస్టారర్ కు ‘దేవదాస్’ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ ని ఆసక్తిగా డిజైన్ చేశారు. టైటిల్ క్రింద తుపాకి, రెండు బుల్లెట్ లని ఉంచారు. నాని ట్విట్టర్ ద్వారా పోస్టర్ షేర్ చేస్తూ…. దేవ అండ్ మి అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి దేవ పాత్రలో నాగార్జున, దాస్ పాత్రలో నాని కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నట్టు తెలిసిందే. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. ఐతే, టైటిల్ పోస్టర్ లో నాగ్, నానిలు లేకపోవడం.. వారి అభిమానులు కాసింత నిరాశకు గురి చేస్తోంది. త్వరలోనే వారి లుక్ లని వదలబోతున్నారు. ఇక, సెంటిమెంట్ ప్రకారం టాలీవుడ్ లో దేవదాస్ బ్లాక్ బస్టర్ హిట్.

అక్కినేని ‘దేవదాసు’ తెలుసు సినిమా ఆణిముత్యాలో ఒకటి. ఇక, ఇదే టైటిల్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ ‘దేవదాస్’ సూపర్ హిట్టయ్యింది. గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చి.. సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ని మోడ్రన్ దేవదాస్ గా కితాబు అందుకొంది. ఈ లెక్కన దేవదాస్ తెలుగు తెరపై బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు నాగ్ నానిల మల్టీస్టారర్ ‘దేవదాస్’ అలాంటి హిట్ నే అందుకుంటుందో చూడాలి.