హైద‌రాబాద్ ఇందిరాపార్కులో మంట‌లు..!!

హైదరాబాద్ ఇందిరపార్కులో ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు చెల‌రేగాయి. పార్కులో చాలాకాలంగా పేరుకుపోయిన చెత్త కుప్పలకు మంటలు అంటుకోవ‌డంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పార్కునుంచి సందర్శకులు బ‌య‌ట‌కు వెళ్లే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జగలేదు. స‌కాలంలో ఫైర్ సిబ్బందికి స‌మాచారం అంద‌క‌నో, ఫైర్ సిబ్బంది ఆల‌స్యం వ‌ల్ల‌నో తెలియ‌దుగానీ మంట‌లు భారీ ఎత్తున ఎగిసిప‌డ్డాయి. పార్కులో చాలా చెట్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఎగిసి పడుతున్న మంటలను అర్పివేసందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్ర‌య‌త్నించిన మంట‌లు అదుపులోకి రావ‌డంలేదు.