‘పంతం’ పబ్లిక్ టాక్

కొత్త దర్శకుడు కె. చక్రవర్తి దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ 25వ సినిమాగా ‘పంతం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్. సామాజిక అంశాలతో కూడిన కథతో తెరకెక్కిన ‘పంతం’ ఈరోజు (జులై 5) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఉదయం పూట ఆట మొదలైపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది.

ముందు నుంచి చెబుతున్నట్టు సామాజిక అంశాలతో కూడిన కథ ఇది. అవినీతికి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా చూపించారు. ఈ ఏపీసోడ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చూపించి కథపై ఆసక్తిని పెంచారు. సినిమాల్లో హీరోయిన్ ని చూసిన హీరో తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం సహజం. ఈ సినిమాలో రివర్స్ గా చూపించారు. హీరోని చూసిన తొలి చూపులోనే హీరోయిన్ ప్రేమలో పడిపోద్ది.

ఇక, సినిమాలో యాక్షన్ కంటే వినోదపు పాళ్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కథని ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ చెప్పాడు దర్శకుడు. గోపీచంద్, శ్రీనివాస రెడ్డి, మరియు పృద్విల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సెకాంఢాఫ్ లో వచ్చే ఒకట్రెండు ట్విస్టులు, యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. మొత్తానికి.. పంతం ఫన్ ని పంచింది. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి కాసిన్ని నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యింది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొందని చెప్పవచ్చు.