‘సంజు’ 6రోజుల కలెక్షన్స్

రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత గాధ ‘సంజు’గా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సంజు’ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఫస్ట్ డే కలెక్షన్స్ బాహుబలి సినిమా రేంజ్ రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ. 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పుడు వారం తిరగక ముందే రూ. 200కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.186.41 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రణ్ బీర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుంది. నేటితో సంజూ రూ.200 కోట్ల మార్కును చేరుకుంటుందని ఉమైర్ వెల్లడించాడు. వీటితో పాటు రణ్ బీర్ సినిమాలు బర్ఫీ, యే జవానీ యే దివాని, యే దిల్ హై ముష్కిల్ చిత్రాల గ్రాస్ కలెక్షన్లను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశాడు .

అంతకుముందు అతి వేగంగా రూ.100కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ‘సంజు’ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వీకెండ్ లో అత్యధిక వసూలు సాధించిన బాలీవుడ్ సినిమాగా సంజు (రూ. 120.6కోట్లు) రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానంలో పద్మావతి రూ. 14కోట్లు. రేస్ 3 రూ. 113కోట్లు, బాహుబలి 2 రూ. 71.10కోట్లు ఉన్నాయి.