త్రిష చేసిన సాహాసం.. మెచ్చుకొని తీరాల్సిందే !
హీరోయిన్ త్రిష టాలీవుడ్’లో కొన్నాళ్ల పాటు హవా సాగించింది. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. స్టార్ హీరోయిన్ రేంజ్ ని అనుభవించింది. కోలీవుడ్ లోనూ ఇదే రేంజ్ లో రాణించింది. ముప్పై యేళ్లు దాటినా యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీనిస్తూ కెరీర్ ని కొనసాగిస్తోంది. ఈ మధ్య ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కెనడా టూర్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ ఓ సాహాసం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ త్రిష చేసిన సాహాసం ఏంటో తెలుసా ? 1,168 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసింది. కెనడా దేశ రాజధాని టోరంటో నగరంలోని రోజర్ సెంటర్లో 1,168 అడుగుల బిల్డింగ్ అంచున రోప్ సాయంతో 10 నిమిషాలు నిలబడి ఆ దృశ్యాలను ఫొటో తీసుకొంది. అక్కడి నుంచి బంగీ జంప్ చేసిందన్న మాట. త్రిష చేసిన సాహాసంపై నెటిజర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, సినిమాల విషయానికొస్తే త్రిష నటించిన ఓరియెంటెడ్ చిత్రం ‘మోహిని’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవేగాక, త్రిష నటిస్తున్న గర్జన, 96, చతురంగవేట్టై–2, పరమపదం, 1818 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఐతే, తెలుగులో త్రిష నుంచి ఒక్క సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
And the best part bein able to watch a good 10 mins of baseball at the Rogers Stadium 1,168 ft. below me 😎 Scoreeeeeeee 👊🏻 pic.twitter.com/BBVWM8omOn
— Trish Krish (@trishtrashers) July 4, 2018
Fate loves the fearless and hence I have always been and will always be 🦁 #bestwaytogetanaerialview #edgewalk #adrenalinejunkie pic.twitter.com/UjQnAaNKz4
— Trish Krish (@trishtrashers) July 4, 2018