పీఆర్సీ చైర్మ‌న్ కు ఉత్త‌మ్ లేఖ‌..

పీఆర్సీ చైర్మన్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఉద్యోగసంఘాలు కోరినంత పీఆర్సీ, ఫిట్మెంట్ ప్రకటించి జూన్2నుంచి అమలు చేయాలని లేఖ ద్వారా కోరారు. మహిళ ఉద్యోగులకు 730రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, భాషా పండితులు, పీఈటీ లకు స్కూల్ అసిస్టెంట్లు గా పదోన్నతి కల్పించాలని లేఖ‌లో పేర్కొన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల మూలవేతనం మధ్య వ్యత్యాసం తగ్గించాలని, విఆర్వో, విఆర్ఏ, నాల్గో తరగతి ఉద్యోగుల వేతనం వంద శాతం పెంచాలన్నారు ఉత్త‌మ్. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల డీఏ 20శాతం పెంచాలని పీఆర్సీ చైర్మ‌న్ కు విజ్ఞ‌ప్తి చేశారు.