షారూఖ్‌ కూతురు పాడుపని.. నెటిజర్స్ మండిపాటు !

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌(18) చేసిన పాడుపనిపై నెటిజర్స్ మండిపడుతున్నారు. ఇంతకీ సుహానా చేసిన పాడుపని ఏంటీ ? అంటే.. తన టూ పీస్ బికినీ ఫోటోని ఇన్ స్ట్రో గ్రామ్ లో అప్ లోడ్ చేయడమే. ప్రస్తుతం షారూఖ్‌ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలో ఒకదాన్ని సుహానా తన ఇన్ స్ట్రో గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అది సుహానా టూ పీస్‌ బికినీ ఫోటో. హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌ కూడా ఉన్నాడు. దీంతో.. ఈ ఫోటోపై నెటిజర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా?, చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది. మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు’ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే, ఈ విమర్శలని సుహానా చాలా తేలికగా తీసుకొన్నట్టు కనబడుతోంది.

ఇదిలావుండగా.. సుహానా అప్పుడే ప్రేమ వ్యవహారాలు మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్ 11 సందర్భంగా ఓ యువ క్రికెట్ తో కలిసి తెగ తిరిగిందని.. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయ్. ఎలాగూ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకొంటున్న సుహానా.. అంతకంటే ముందు హాట్ హాట్ ఫోటోలు, ప్రేమ వ్యవహారాలతో ఫాలోయింగ్ ని పెంచుకొనే పనిలో ఉన్నట్టు కనబడుతోంది.

My hotty babeis 🔥❤

A post shared by suhana khan (@suhanakha2) on