భారత్‌దే టీ20 సిరీస్‌

ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా టీ20 సిరీస్ ని గెలిచేసింది. మూడో టీ20లో కోహ్లీ సేన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకొంది. దీంతో 2-0తో సిరీస్ ని కైవసం చేసుకొంది. రోహిత్‌(100; 56బంతుల్లో 11×4, 5×6) శతకంతో రెచ్చిపోయాడు. కెప్టెన్‌ కోహ్లీ (43; 29 బంతుల్లో 2×4, 2×6), హర్ధిక్‌ పాండ్య (33; 14బంతుల్లో 4×4, 2×6) రాణించారు. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ (67; 31బంతుల్లో 4×4, 7×6), జోస్‌ బట్లర్‌(34; 21బంతుల్లో 7×4) చెలరేగి ఆడటంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 198పరుగులు సాధించింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించేందుకు కోహ్లీసేన పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. మొదటి నుంచి ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రోహిత్‌ వరుస బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన సునాసయంగా చేధించింది. టీ20 సిరీస్ ని కైవసం చేసుకొంది. ఈ నెల 12 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్ డే సిరీస్ మొదలు కానుంది.