క‌త్తి వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా యాదాద్రికి పాద‌యాత్ర‌..!

రాముడుని ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద స్వామి ఖండించారు. శ్రీరాముడిని పరుష పదజాలంతో మాట్లాడిన వారిని వదల‌మ‌ని, ధర్మాగ్రహంతో తామంతా రోడ్డు ఎక్కుతున్నామ‌న్నారు. రాముడిపై వ్యాఖ్యలకు నిరసనగా బ‌షీర్ బాగ్ లో అమ్మవారికి మెక్కులు చెల్లించి, అంబెద్క‌ర్ కు నివాళుల‌ర్పించి సోమ‌వారం రేపు యాద్రాద్రికి పాదయాత్ర నిర్వహిస్తామ‌ని చెప్పారు స్వామిజీ. రామనామ సంకీర్తనలతో యాదాద్రి వరకూ రెండు రోజులపాటు పాదయాత్ర నిర్వహిస్తామ‌న్నారాయ‌న‌.

స్వామీజీలం కాబట్టే ధర్మసాధన కోసం సాధువులా నిగ్రహంతో ఉన్నామ‌న్నారాయ‌న‌. ధర్మపరిరక్షణ కోసం కొన్నిసార్లు సైనికులంమవుతామ‌ని, శాతియుతంగా రామనామస్మరణతో సోమవారం బోడ్డుప్పల్ నుంచి యాదాద్రి వరకూ పాదయాత్ర చేస్తామ‌న్నారు. పాదయాత్ర పూర్తయేవరకూ హిందువులంతా రామకోటి రాసి త‌మ‌కు అందించాల‌ని కోరారు. హిందువులు అందించిన రామకోటిని భద్రాచంలోని శ్రీరాముడి పాదల వద్ద ఉంచుతామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత లేదని, రాజకీయ న్యాయకులెవరైనా ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చని చెప్పారు. త‌మ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను యాదాద్రి కొండ‌పై ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు ప‌రిపూర్ణానంద స్వామి.