ఇకపై మెగాస్టార్ సినిమాలకే అంకితం

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరితమం కానున్నాడు. 2009లో మెగాస్టార్ సునామీలా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రజారాజ్యం పార్టీ’ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగాడు. ఐతే, ఆశించిన స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత రాజకీయ ఎత్తులు-పైఎత్తులకు ఎదురు నిలబడి పార్టీకి ముందుకు తీసుకెళ్లలేకపోయాడు చిరు. ప్రజారాజ్యంని కాంగ్రెస్ రాజ్యంలో కలిపేశారు. దానికి ఫలితంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. అదే సమయంలో ప్రజల్లో మెగాస్టార్ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

అప్పటికే మెగాస్టార్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే డిమాండ్ జోరందుకొంది. ఈ నేపథ్యంలోనే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం. 150’ని ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఆయనపై మునుపటి అభిమానంనే చూపారు. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత పొలిటికల్ గా సైలైంట్ అయిపోయారు చిరు. ఐతే, ఆయన మళ్లీ అటు వైపు చూస్తారేమోననే భయం అభిమానులని కలవర పెడుతోంది. సాధారణ ఎన్నికలు మరో పది నెలల్లో ఉండగా చిరు మళ్లీ పొలిటిక్స్ ఫోకస్ చేస్తారేమో.. ! అదే జరిగితే చిరు మరోసారి సినిమాలకు దూరం అవుతాడని భయపడిపోతున్నారు.

ఇప్పుడీ విషయంపై చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్.. ఇకపై అన్నయ్యకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఆయన సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేశారు’ తెలిపారు. ఇప్పుడీ వార్త మెగా అభిమానులని సంతోష పెడుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ ‘సైరా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాదు.. ఆయన్ని మరిన్ని సినిమాలు వస్తాయని.. పవన్ ఇచ్చిన క్లారిటీతో అర్థమైంది.