రేణుకు తెలియకుండానే పవన్ బిడ్డని కన్నాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు పవన్ ఫ్యాన్స్ కు గట్టి హెచ్చరికలు చేస్తోంది రేణు. ఇకపై తనని వదిలేయాలని, తన పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేయొద్దని కోరుతోంది. అదే సమయంలో పవన్ పెళ్లాడి ఇద్దరు బిడ్డలని కని కాపురం చేస్తున్న ఆవిడని వదిన అని పిలుచుకోండని సూచిస్తోంది.

ఇక, తనని రెండో పెళ్లి వద్దని సూచిస్తున్న పవన్ లేడీ ఫ్యాన్స్ కి గట్టిగా సమాధానం చెప్పింది. ‘నా స్థానంలో మీరు ఉంటే నా పరిస్థితి ఏంటన్నది మీకు అర్థమవుతుంది. పెళ్లైన 11 సం॥రాల తర్వాత మీ భర్త మీకు తెలియకుండా మరో అమ్మాయితో ఓ బిడ్డను కని ఉంటే ఆ బాధ ఏంటన్నది మీకు తెలిసేది’ చెప్పింది.

దీన్ని బట్టి పవన్ రేణుకు తెలియకుండానే అన్నాతో వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. ఇదే రేణు-పవన్ విడిపోడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిజనిజాలు చెబితే పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రస్తుతం పవన్ పొలిటిక్స్ లో ఉన్నారు. ఆయన సమాజానికి ఏదో చేయాలనే తపన గల వ్యక్తి. డబ్బుపై ఆయనకు మోజు లేదు. ఇకపై పవన్ ఫ్యాన్స్ నన్ను వదిలేయండని కోరింది రేణు.