ఫుట్ బాల్, క్రికెట్.. సేమ్ రిజల్ట్.. !!
ఆదివారం ఆట ప్రేక్షకులకి కిక్కునిచ్చింది. ఓ వైపు ఫిఫా వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్, మరోవైపు, భారత్-ఇంగ్లాండ్ ల ఆఖరి టీ20 క్రీడాభిమానలకి మజా పంచాయి. ఐతే, రెండో చోట్ల సేమ్ రిజల్ట్ రావడం విశేషం. అదెలా ? అంటే.. రెండూ చోట్ల ఆతిథ్య జట్లకు పరాభవం తప్పలేదు. ఫిపా ప్రపంచ క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య రష్యాను క్రొయేషియా ఓడించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-3తో రష్యాను ఓడించింది చిన్ని దేశం క్రొయేషియా.
ఇంగ్లాండ్ తో మూడో టీ20లో కోహ్లీ సేన అదరగొట్టింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకొంది. దీంతో 2-0తో సిరీస్ ని కైవసం చేసుకొంది. రోహిత్(100; 56బంతుల్లో 11×4, 5×6) శతకంతో రెచ్చిపోయాడు. కెప్టెన్ కోహ్లీ (43; 29 బంతుల్లో 2×4, 2×6), హర్ధిక్ పాండ్య (33; 14బంతుల్లో 4×4, 2×6) రాణించారు. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ రెండు చోట్ల ఆతిథ్య జట్లు ఓటమి చెందడం ఆకట్టుకుంటోంది.