దుష్ట‌శ‌క్తుల‌కు స‌ప్రీం తీర్పు చెంప‌పెట్టు..!

కాళేశ్వ‌రంపై వేసిన పిటిన్ ను సుప్రీం కొట్టివేయ‌డంపై మంత్రి హరీష్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాళేశ్వరంని అడ్డుకుంటామన్న దుష్టశక్తులకు సుప్రీమ్ తీర్పు చెంపపెట్టులాంటిద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. హై కోర్ట్ లొనే 80 కేస్ లు వేశారని, ప్రాజెక్ట్స్ అపడమే ఆ దుష్ట శక్తుల టార్గెట్ అంటూ దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిసార్లు కోర్ట్ లకు వెళ్తున్నా.. మొట్టికాయలు తప్పడం లేద‌ని , అయినా కాంగ్రెస్ వారికి సిగ్గు రావ‌డంలేద‌న్నారు హ‌రీష్.

ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని కాంగ్రెస్ భావిస్తోంద‌ని, వారి ఆట‌లు సాగ‌వ‌ని అన్నారు మంత్రి హ‌రీష్. కాంగ్రెస్ నీచ‌మైన రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. మొబైలేజేష‌న్ ఛార్జ్ ల పేరుతో 2,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ నేతలు నొక్కేసారని ఆరోపించారు. రైతుల‌కు నీళ్లు రాకుండా అడ్డుకోవ‌డ‌మే కాంగ్రెస్ ల‌క్ష్య‌మన్నారు. ఇక‌నైనా కాంగ్రెస్ నేత‌లు కుట్ర‌లు మాని, ప్ర‌జ‌ల‌కు మంచి చెయ్యాల‌ని సూచించారాయ‌న‌.