కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీతో హ‌రీష్ భేటీ సారాంశ‌మిదే..!!

ఢిల్లీ టూర్ లో ఉన్న మంత్రి హ‌రీష్ రావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని క‌లిశారు. రాష్ట్రనికి రావాల్సిన నిధుల‌పై ఆయ‌న‌తో చర్చించారు. నీటీ పారుదల ప్రాజెక్ట్ లకు సహకారం, జాతీయ రహదారుల కేటాయింపుపై ఆయ‌న చ‌ర్చించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. భీమా, నీల్వాయి, ర్యాలి వాగు, మత్తడి వాగు, కొమరం భీం ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంద‌ని ఈ అంశంపై స‌మావేశంలో చ‌ర్చించామ‌ని ఆయ‌న తెలిపారు.

మూడు నెలల కాలానికి దాదాపు యాభై నుంచి 60 కోట్లు రావాల్సి ఉందని, నిధుల విడుదలపై కేంద్ర మంత్రి అధికారుల‌ను ఆదేశించారని హ‌రీష్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపులో రాష్ట్రం నుంచి 7 జాతీయ రహదారులను కేటాయించాలని కోరామ‌న్నారు. సిద్దిపేట-ఎల్కతుర్తి, జనగామా-దుద్దెడ, మెదక్-ఎల్లారెడగడి, పకీరా బాద్-బైంసా, సిరిసిల్ల-కామారెడ్డి, వలిగొండ-తొర్రురూ, నిర్మల్-ఖానాపూర్ ఆర్థిక ప్రణాళికలో చేర్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరామ‌న్నారు. త‌మ విజ్ఞ‌ప్తుల‌పై కేంద్రమంత్రి గ‌డ్క‌రి సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు హ‌రీష్.