ప‌వ‌న్ కు ఇష్ట‌మైన హీరోలు వాళ్లిద్ద‌రేన‌ట‌..!!

మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల నేత‌లు, అభిమానులు జ‌న‌సేన పార్టీలో చేరిపోయారు. ప‌వ‌న్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వ‌నించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కొన్ని విష‌యాల‌ను అభిమానులు, పార్టీనేత‌ల‌తో పంచుకున్నారు.
జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది కూడా అని చెప్పుకొచ్చారు. చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కాబట్టే .. పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయలేదని అన్నారు ప‌వ‌న్. చిరు సినిమాల్లోకి రాక‌ముందే తాను అన్న‌య్య‌ను ఒక హీరోగా చూసేవాడిన‌ని చెప్పారు ప‌వ‌న్. అన్న‌య్య ఎన్.సీ.సీ త‌ర‌పున రిప‌బ్లిక్ డే కు ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీ ముందు సెల్యూట్ చేశార‌ని చెప్పారు. అప్ప‌ట్లో అన్న‌య్య‌ను ఎవ‌రైనా మాట అంటే కొట్టేసేవాడిన‌ని చెప్పారు. జ‌న‌సేన పార్టీలో చేరే అంశాన్ని అన్న‌య్య ఆయ‌న అభిమానుల‌కే వ‌దిలేశార‌ని, వారిని పార్టీలోకి మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాన‌ని చెప్ఆప‌రు. తామిద్ద‌రివి భిన్న‌మైన వ్య‌క్తిత్వాల‌ని, అవి అర్థం చేసుకోక‌పోతే స్ప‌ర్థ‌ల‌కు దారితీస్తుంద‌ని చెప్పారు. త‌న‌కు ఇద్ద‌రు హీరోలంటే ఇష్ట‌మ‌ని, ఒక‌రు అమితాబ్, మ‌రోక‌రు అన్న‌య్య చిరంజీవి అని చెప్పారు జ‌న‌సేనాని.