కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు..!!
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యచేసిన కత్తి మహేష్ పై గతకొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, హిందూవాదులు కత్తి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఒకడుగు ముదుకేసీ కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మత విద్వేశాలు తలెత్తే ప్రమాదం ఉండటంతో అటు స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులకు కత్తి మహేష్ ని హ్యాండోవర్ చేశారు హైదరాబాద్ పోలీసులు. కత్తి మహేష్ ని ఆంధ్ర ప్రదేశ్ కి తరలిస్తున్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కాకుండా ఉండేందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ ఫై నగర బహిష్కరణ వేటు వేశారు హైదరాబాద్ పోలీసులు. పోలీసులకు తెలియకుండా, పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ రావొద్దని కత్తి మహేష్ కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు..