సుకుమార్ ఆలోచన స్థాయి.. ఈ సక్సెస్ !

రామ్ చరణ్ ‘రంగస్థలం’ 100 రోజుల పండగ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చిత్రబృందానికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు. ఇంతటి సక్సెస్ కు అసలు కారణం ఓ ఆలోచన. ఆ ఆలోచన దర్శకుడు సుకుమార్ కలం నుంచి వచ్చింది. సుకుమార్ ఆలోచన స్థాయి.. ఈ సక్సెస్ కు కారణమన్నారు చరణ్. సినిమాటోగ్రఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సమంత, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆదిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

అదే సమయంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చెప్పే ఓ మాటని అభిమానులతో పంచుకొన్నారు. ‘మనతో పాటు పంది మంది ఎదిగేందుకు మనం కృషి చేయాలి. మనం పడిపోయినప్పుడు ఆ పది మందే మనకు అండగా ఉంటారు’ అని నాన్న చెబుతారని చెప్పారు. మాకు అండగా నిలిచిన డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు రావడం సంతోషంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి విజయాలే దక్కాలని కోరుకుంటున్నానని చెప్పి ప్రసంగాన్ని ముగించారు.

ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. హెవీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకాగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు చరణ్.