ఎంసెట్ లీకేజ్ వెనక రూ. 100 కోట్ల స్కాం !

తెలంగాణ ఎంసెట్ లీకేజ్ కేసు షాకింగ్ నిజాలు వెలుగులోని వస్తున్నాయి. దీని వెనక రూ. 100కోట్ల కుంభకోణం జరిగినట్టు సీఐడీ విచారణలో తేలినట్టు సమాచారమ్. లీకైన పేపరుతో దాదాపు 250 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో ఒక్కొక్కరి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 35లక్షల వరకు వసూలు చేశారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు క్యాంపులు నిర్వహించి డబ్బులు దండుకొన్నారు.

ఈ కేసులో ఇప్పటికే 90 మంది నిందితులని అరెస్ట్ చేసింది సీఐడీ. అరెస్టైన వారిలో కార్పోరేటు కళాశాల సిబ్బంది ఉండటం విశేషం. మరో 10 మంది కీలక నిందితుల కోసం వెతుకుతున్నారు. 2016 నుంచి సాగుతున్న దర్యాప్తు కోసం రూ. 65 లక్షలు ఖర్చు అయినట్టు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రాంతాలకో చెందిన నిందితులను గుర్తించి, వారికోసం రోజుల తరబడి నిఘా పెట్టి పట్టుకునేందుకు భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది.